వెలది సొబగులివి విన్నవించితిమి
నెలకొని ఇక కరుణించవయా ||
చెలపల చెలపల చెమటలు గారీ
వలపున పొడమిన వానలివి |
సొలపుల సొలపుల చూపులు వొదలీ
తెలుపుగ వెన్నెల తేటలివి ||
బుసబుసమను నూర్పులు చిగిరించీ
వసంతకాలపు వరుసలివి |
మిస మిస కాంతులు మెరుగులు వారీ
యెసగిన విరహపు టెండలివి ||
మది మది (గో ర్కుల మంచులు కురిసీ
మదనుని అలహేమంత మిది |
యిదె యిదె శ్రీ వేంకటేశ యింతి గూడితి
వదలని కాగిళ్ళవాడికలివి ||
No comments:
Post a Comment